“అల వైకుంఠపురములో” హిందీ రీమేక్ కి పూర్ ఓపెనింగ్స్.!

Published on Feb 19, 2023 1:00 am IST


మన టాలీవుడ్ లో భారీ హిట్స్ లో ఒకటైనటువంటి చిత్రం “అల వైకుంఠపురంలో” కోసం చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఫుల్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో హ్యాట్రిక్ గా మరోసారి ప్రూవ్ చేశారు. దీనితో సెన్సేషనల్ హిట్ అయ్యిన ఈ సినిమా ని హిందీలో “షెహ్ జాదా” గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించాడు.

అయితే ఈ సినిమా హిందీలో మంచి ప్రమోషన్స్ మరియు బజ్ తో రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా మాత్రం అనుకున్న రేంజ్ హైప్ ని ఆడియెన్స్ లో క్రియేట్ చెయ్యలేకపోయింది. దీనితో ఈ చిత్రం మాత్రం వసూళ్లు కూడా అంత అనుకున్న రేంజ్ లో మొదటి రోజు రాబట్టనట్టే తెలుస్తుంది.

హిందీలో మొదటి రోజు కేవలం ఈ సినిమా 6 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే అందుకుందట. సినిమాపై పెట్టుకున్న అంచనాలకి అయితే ఇది చాలా తక్కువే అని ట్రేడ్ చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ కూడా పెద్దగా మారే ఛాన్స్ కూడా తక్కువే అని అంటున్నారు. మరి ఈ సినిమాకి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :