నానితో నటించనున్న ప్రముఖ హీరోయిన్ ?

Anushka

సహజ నటుడు నాని ప్రస్తుతం శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న’ దేవదాస్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున తో కలిసి నటిస్తున్నాడు. దాంతో పాటు బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ 2 ‘కు కూడా వాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక వీటితో పాటు త్వరలోనే ‘మళ్ళీ రావా’ చిత్ర డైరెక్టర్ గౌతమ్ తెరకెక్కించే ‘జెర్సీ’ చిత్రంలో నటిచనున్నాడు. ఇక ఇప్పుడు ఆయన తాజాగా ‘సాహసం’ చిత్ర డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నటించనున్నాడని కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రముఖ హీరోయిన్ అనుష్క ను తీసుకోవాలనుకుంటున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. కొద్దీ రోజుల్లోనే ఆమె కు స్క్రిప్ట్ వినిపించనున్నారని సమాచారం. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది.

Exit mobile version