రిపోర్టర్ గా మారిన పాపులర్ యాంకర్ !
Published on Oct 30, 2017 11:47 am IST

డా.మోహన్ బాబు రౌడి సినిమా తరువాత గ్యాప్ తీసుకొని ‘గాయత్రి’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు, తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విష్ణు కూడా నటిస్తున్నాడు, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ అయ్యింది, రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి, త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్, ప్రముఖ యాంకర్ అనసూయ ఈ సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం, ఈ చిత్రంలో మోహన్ బాబు హీరోగా, విలన్ గా రెండు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

 
Like us on Facebook