మెగా హీరో సినిమా శాటిలైట్ హక్కులకు మంచి ఆఫర్ !

ఇటీవలే ‘జవాన్’ సినిమాతో ప్రేక్షకుల్ ముందుకొచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తన తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టారు. వాటిలో ఒకటి స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం కూడా ఉంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అది కూడా మంచి మొత్తానికే కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ బడ్జెట్ తోనే రూపొందుతున్న ఈ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.