‘బిచ్చగాడు – 2’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

‘బిచ్చగాడు – 2’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Dec 20, 2022 9:21 PM IST


సరిగ్గా ఆరేళ్ళ క్రితం శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ బిచ్చగాడు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఆ మూవీకి సీక్వెల్ గా విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతోంది బిచ్చగాడు 2. కాగా ఈ మూవీకి విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందిస్తూ దర్శకత్వం కూడా వహిస్తుండడం విశేషం.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క శాటిలైట్, డిజిటల్ రైట్స్ ని ప్రముఖ సంస్థ స్టార్ నెట్వర్క్ వారు లేటెస్ట్ గా భారీ ధరకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ కి అందరి నుండి మంచి స్పందన లభించింది. హరీష్ పెరాడి, కావ్య థాపర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న బిచ్చగాడు 2 మూవీని 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు