పవన్-త్రివిక్రమ్ సినిమాలో ప్రముఖ తమిళ కమెడియన్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తరువాతి చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ విడుదలతో పవన్ ఫ్రీ అవడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో మొదలుపెట్టాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘మారి, సింగం 3’ వంటి చిత్రాలతో తమిళనాట మంచి పాపులారిటీ తెచ్చుకుని ప్రముఖ కమెడియన్ గా ఎదిగిన రోబో శంకర్ ఇందులో ఒక కీ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై త్రివిక్రమ్ నుండి ఇంకా కన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఇకపోతే ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుగా ప్లాన్ చేసిన సమయానికే విడుదల చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. పవన్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనిపించనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించనుండగా అనిరుద్ సంగీతం చేయనున్నాడు.