‘మహానటి’ లో కీలక పాత్ర దక్కించుకున్న ప్రముఖ రచయిత !
Published on Oct 22, 2017 6:19 pm IST


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మహనటి’ చిత్రం రోజుకొక విశేషాన్ని సంతరించుకుంటోంది. ఇప్పటికే ఎంవి రంగారావు పాత్రలో మంచు మోహన్ బాబు, దర్శకుడు కెవి. రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్, సింగీతం శ్రీనివాస రావ్ గా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి వారిని ఎంపిక చేసి సినిమా కోసం ఏకంగా ‘మాయాబజార్’ చిత్రీకరణ సన్నివేశాల్ని తెరకెక్కిస్తూ అందరిలోను తీవ్ర ఆసక్తిని రేపిన అశ్విన్ తాజాగా మరొక ప్రముఖ పాత్ర కోసం ప్రముఖ రచయితను ఎంపిక చేసుకున్నారు.

ఆ పాత్రే 1960, 70 ల కాలంలో పరిశ్రమలో ప్రముఖ సినీ రచయితగా వెలుగొందిన పింగళి పాత్ర. ఈ పాత్ర కోసం ప్రస్తుతం రచయితగా మంచి పేరు తెచ్చుకున్న సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు. పాత్రల విషయంలో నాగ్ అశ్విన్ చూపుతున్న ఖచ్చితత్వం చూస్తుంటే సినిమా కోసం ఆయన ఎంతలా రీసెర్చ్ చేశారో ఇట్టే అవగతమవుతోంది. ఇకపోతే ఇందులో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్, సమంత, షాలిని పాండేలు పలు కీలక పాత్రల్లోనూ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

 
Like us on Facebook