‘హిట్ – 2’ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Nov 30, 2022 12:06 am IST


అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ 2 ది సెకండ్ కేస్. డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ యాక్షన్ తో కూడిన సస్పెన్స్ ఎంటర్టైనర్ గా రూపొందింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పిస్తుండగా ప్రశాంతి తిపిర్నేని దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే హిట్ 2 నుండి రిలీజ్ అయిన ఉరికే ఉరికే అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ అన్ని కూడా సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుని మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే విషయం ఏంటంటే, ఈ మూవీ నుండి పోరాటమే అనే పల్లవితో సాగే థీమ్ సాంగ్ ని రేపు ఉదయం 11 గం. 07 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ ప్రకటించింది. అయితే ఇది పోరాటమే 2 కాగా గతంలో విశ్వక్ సేన్ నటించిన హిట్ 1 మూవీలో వచ్చిన పోరాటమే 1 సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ఈ పోరాటమే 2 సాంగ్ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్. డైరెక్టర్ శైలేష్ కొలను పాడిన ఈ సాంగ్ ని సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసారు. మరి ఈ విధంగా అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన హిట్ 2 మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :