పోరి సూపరో అంటున్న నితిన్.. వైరల్ అవుతున్న సాంగ్ !

పోరి సూపరో అంటున్న నితిన్.. వైరల్ అవుతున్న సాంగ్ !

Published on Aug 7, 2022 8:31 PM IST

ఎం.ఎస్ రాజాశేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. కాగా ఆగ‌స్టు 12న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి మరో వీడియో సాంగ్ రిలీజైంది. ‘పోరి సూపరో’ అనే పాటలో నితిన్, కృతి శెట్టి స్టెప్స్ అలరిస్తున్నాయి. మహతీ స్వరసాగర్ మ్యూజిక్ ఇవ్వగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆ పాట పాడారు.

ఇప్పటికే విడుదలైన ‘రారా రెడ్డి’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ని చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి కలెక్షన్స్ ఎలా వస్తాయో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు