కరోనా బారిన పడ్డ ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి..!

Published on Jul 30, 2021 12:00 am IST

ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. తనతోపాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు పోసాని తెలిపారు. ప్రస్తుతం తాను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పారు. అయితే కరోనా రావడం కారణంగా తాను నటిస్తున్న సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని, ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని అన్నారు.

అయితే ఈ అసౌకర్యానికి నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలు నన్ను మనస్ఫూర్తిగా మన్నించాలని కోరారు. కాగా ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో, దేవుడి దయవల్ల త్వరలోనే కరోనా నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :