అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్న ‘పెళ్లి చూపులు’

Pellichoopulu
నూతన దర్శకుడు ‘తరుణ్ భాస్కర్’ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ, నీతూ వర్మ’ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. పెళ్లి చూపుల్లో కలుసుకున్న అమ్మాయి, అబ్బాయిల మధ్య ఏర్పడ్డ పరిచయం గౌరవంగా మారి, ఆ గౌరవం కాస్త ప్రేమగా మారే కథే ఈ పెళ్లి చూపులు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్లు ఈ మధ్యే విడుదలై మంచి స్పందనను అందుకుంటున్నాయి.

పైగా ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తుండటం వల్ల సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇటీవలే టెస్ట్ స్క్రీనింగ్ జరుపుకునే ఈ చిత్రంలో గుండెలకు హత్తుకునే భావోద్వేగపూరితమైన సన్నివేశాలు, సున్నితమైన అన్నిభూతులు పుష్కలంగా ఉన్నాయన్నా మంచి పాజిటివ్ టాక్ బయటకు రావడంతో ఈ క్రేజ్ మరింతగా పెరిగింది. రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.