
మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా సినిమా ‘పవర్’ ఆడియో ఈ ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో భారి ఎత్తున జరగనుంది. ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘బలుపు’ వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత మరోసారి యువ సంగీత సంచలనం తమన్ రవితేజ సినిమాకు సంగీతం అందించారు. ఆల్బంలో మూడవ పాట ‘నోటంకి’ రవితేజ పాడారు. ‘బలుపు’లో కూడా రవితేజ చేత ఓ పాట పాడించారు తమన్. అది సూపర్ హిట్ అయ్యింది. ‘పవర్’లో పాట ఎలా ఉంటుందో..? అని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
‘పవర్’ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.
1) దేవుడా.. దేవుడా…
2) బద్మాషు పిల్లా
3) నోటంకి
4) చంపేసిందే
5) నువ్వు నేను
రవితేజ సరసన హన్సిక, రేజీనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సినిమా ఆగస్ట్ 29 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.