అసలు ట్రాక్ ఎక్కిన బోయపాటి !

21st, July 2017 - 09:00:21 AM


యాక్షన్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ‘జయ జానకి నాయక’ రెండవ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మొదటి టీజర్ ను అంచనాలకు భిన్నంగా కూల్ గా రొమాంటిక్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసి బోయపాటి ఈసారి స్టైల్ మార్చారా ఏంటి అనేట్టు అందరినీ సప్రైజ్ చేసిన ఆయన ఈ రెండవ టీజర్లో మాత్రం తన అసలు ట్రాక్లోకి వచ్చేశారు.

54 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ను హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో, పవర్ ఫుల్ డైలాగ్ తో నింపి తన ట్రేడ్ మార్కును గుర్తుచేశారు. అంతేగాక సినిమాలో యాక్షన్ మోతాదు ఎక్కువగానే ఉంటుందని కూడా చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నారు.

టీజర్ కొరకు క్లిక్ చేయండి