లేటెస్ట్ క్లిక్ : పవర్ఫుల్ లుక్ లో అదరగొట్టిన పవర్ స్టార్

Published on Mar 11, 2023 7:00 pm IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా ఒక్కో సినిమాతో వరుసగా సక్సెస్ లు సొంతం చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రెండూ కూడా సూపర్ సక్సెస్ లు సొంతం చేసుకుని హీరోగా ఆయన క్రేజ్ ని మరింతగా పెంచాయి. ప్రస్తుతం క్రిష్ తో హరిహర వీరమల్లు, సముద్రఖని తో వినోదయ సిత్తం మూవీ రీమేక్స్ లో నటిస్తున్నారు పవర్ స్టార్. దాని అనంతరం సుజీత్, హరీష్ శంకర్ ల సినిమాల షూట్స్ లో ఆయన జాయిన్ అవ్వనున్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా కొనసాగుతున్న పవన్, మార్చి 14న మచిలీపట్నంలో జరుగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యకమంలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు.

అందులో భాగంగా నేడు విజయవాడకి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు పవర్ స్టార్. కాగా ఆయన విమానంలో దిగిన ఒక పవర్ఫుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నటుడిగా 27 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని ఆడియన్స్, ఫ్యాన్స్ తో పవర్ స్టార్ గా గొప్ప పేరుని అలానే ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లని, భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ కొనసాగుతున్నారు. ఇక తమ అభిమాన పవర్ స్టార్ అటు సినిమాల పరంగా అలానే ఇటు రాజకీయాల పరంగా కూడా ఇకపై మరింత సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్, ఆడియన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :