పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు జనసేన పార్టీ కార్యకలాపాలతో పాటు ఇటు వరుసగా సినిమాలతో కూడా కెరీర్ పరంగా కొనసాగుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న సినిమాల్లో సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుండగా అనంతరం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది. అలానే క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా దీనిని కూడా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది.
అయితే విషయం ఏమిటంటే, రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నేడు కొద్దిసేపటి క్రితం ఆయన న్యూ మూవీకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ ఒక మూవీ చేయనున్నారు అనే వార్తలు కొన్నాళ్లుగా ప్రచారం అవుతున్నాయి. అయితే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజక్ట్ కి సంబందించిన ఆఫీస్ ని నేడు ప్రారంభించారు. దీనిని బట్టి ఈ క్రేజీ ప్రాజక్ట్ అతి త్వరలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ మూవీ గురించిన పూర్తి డీటెయిల్స్ త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.