మాస్ కమర్షియల్ డైరెక్టర్ కి పవర్ స్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్

Published on Mar 31, 2023 9:00 pm IST


టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా ప్రతి సినిమాతో మంచి సక్సెస్ లని అలానే ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుని దూసుకెళ్తున్నారు హరీష్ శంకర్. తొలిసారిగా రవితేజ, జ్యోతిక కలయికలో తెరకెక్కిన షాక్ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన హరీష్ శంకర్, ఆ తరువాత రవితేజ తో మరొక్కసారి తీసిన మిరపకాయ్ మూవీతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి భారీ హిట్ సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ఆపైన మరిన్ని విజయాలు అందుకున్నారు. ఇక ప్రస్తుతం మరొక్కసారి పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కాగా విషయం ఏమిటంటే, నేడు హరీష్ శంకర్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రేక్షకాభిమానుల తో పాటు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తుండగా కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ తరపున ఒక ప్రెస్ నోట్ ద్వారా హరీష్ శంకర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియచేసారు. ప్రేక్షకుల నాడి, నవతరం అభిరుచులు తెలిసిన దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, తెలుగు భాష రచనలపైన, కళల గురించి చక్కటి అవగాహన ఉన్న దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తన నోట్ లో తెలిపారు.

సంబంధిత సమాచారం :