పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన “బ్రో” మేకర్స్!

Published on May 29, 2023 11:04 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ తొలిసారి బ్రో అనే బిగ్గీ కోసం చేతులు కలిపారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28, 2023న భారీగా థియేటర్ల లో విడుదల కానుంది. ఈ హీరోలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ నేడు విడుదల చేశారు. తాజా పోస్టర్‌లో వీరిద్దరూ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

హీరోల అభిమానులు వారిని కలిసి చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాశారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ కామెడీ డ్రామాను భారీ స్థాయిలో నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :