బాలక్రిష్ణ 102వ సినిమాకి ప్రస్తావనలో ఉన్న ఆసక్తికరమైన టైటిల్ !
Published on Oct 9, 2017 5:05 pm IST

ఇటీవలే ‘పైసా వసూల్’ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం తన 102వ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం తాలూకు రెండు షెడ్యూళ్లు ముగిశాయి. పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉడనున్న ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో బోలెడు అంచనాలున్నాయి.

ఇకపోతే సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రస్తావనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయకిగా నటిస్తుండగా మలయాళ హీరోయిన్ నటాషా దోషి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతి బరిలోకి దింపనున్నారు.

 
Like us on Facebook