అఫీషియల్ : పవర్ఫుల్ టైటిల్ తో తలైవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్.!

Published on Jun 17, 2022 1:00 pm IST


కోలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో రజిని తన కెరీర్ లో 169వ చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్సమెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా టీజ్ చేసారు. అయితే ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఈ బిగ్ అనౌన్సమెంట్ ని రివీల్ చేశారు.

అంతా ఈ చిత్రం టైటిల్ కోసం ఎదురు చూస్తుండగా మేకర్స్ దీనిపై ఒక అఫీషియల్ అప్డేట్ ని ఇచ్చేసారు. మరి దీనిపై ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసి అందులో వేలాడదీసిన కత్తి దానికి రక్తంతో ఈ సినిమాకి “జైలర్” అనే టైటిల్ ని పెట్టినట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో ఈ మాస్ టైటిల్ పట్ల రజిని ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :