బాలయ్య సినిమాకు పెట్టబోయే పవర్ ఫుల్ టైటిల్ ఇదే !

బాలకృష్ణ ఇప్పుడు తమిళ దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో తన 102 వ చిత్రాన్ని మొదలుపెట్టి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తుండగా, నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మరో ఇద్దరు హీరోయిన్స్ హరి తేజ, నటాషా దోషిలు కూడా బాలయ్యకి జోడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చెయ్యడానికి యూనిట్ ప్రయత్నిస్తోంది.

ఈ సినిమాకు మొదట్లో ’కర్ణ’ టైటిల్ ను పెడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ‘జై సింహ’ టైటిల్ సినిమాకు సరైన టైటిల్ గా దర్శక నిర్మాతలు భావించి దీన్ని నిర్ణయించారట. ఏది ఏమైనా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. బాలయ్య ‘సింహ’ టైటిల్ కు దగ్గర గా ఉండే ‘జై సింహ’ టైటిల్ క్యాచ్చి గా, పవర్ ఫుల్ గా కూడా ఉంది. ఇకపోతే ఈ సినిమా తరువాత బాలయ్య తేజ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో నటించబోతున్న సంగతి తెలిసిందే.