బాలయ్య 102వ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ ?
Published on Jul 5, 2017 3:54 pm IST


100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయం తర్వాత సరికొత్త ఉత్తేజంతో వేగం పెంచిన నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత 101, 102 సినిమాల్ని వెంట వెంటనే ప్రకటించేశారు. వాటిలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న 101వ చిత్రం ఇప్పటికే మొదలై చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక 102వ సినిమాని సీనియర్ దర్శకుడు కెఎస్. రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ ఆగష్టు 2వ వారం నుండి కుంభకోణంలో మొదలుకానుంది. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారో చూడాలని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నైపథ్యంలో పలు పేర్లు వినబడినా ఈ చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ గారు తన సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘రూలర్’ అనే టైటిల్ ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీన్నిబట్టి చూస్తే ఈ పవర్ ఫుల్ టైటిల్ బాలయ్య సినిమా కోసమే అని అనిపిస్తోంది. కానీ పూర్తి స్థాయి నిర్ధారణ రావాలంటే మాత్రం చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడక తప్పదు.

 
Like us on Facebook