పవర్ స్టార్ మూవీ టైటిల్ అదేనట కానీ….?

పవర్ స్టార్ మూవీ టైటిల్ అదేనట కానీ….?

Published on Dec 10, 2022 8:40 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ కొన్నేళ్ల క్రితం తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ అప్పట్లో పెద్ద సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందిన ఆ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, యాక్టింగ్, స్టైల్ కి విపరీతమైన రెస్పాన్స్ లభించింది. అయితే లేటెస్ట్ గా మళ్ళి పదేళ్ల గ్యాప్ తరువాత అతి త్వరలో మరొక్కసారి పవర్ స్టార్ తో మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు హరీష్ శంకర్. ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నుండి వీరిద్దరి కాంబో మూవీ భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

అయితే పవర్ స్టార్ తో తన మూవీ గురించి అతి త్వరలో బిగ్ అప్ డేట్ రానుంది అంటూ రెండు రోజుల క్రితం హరీష్ శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న మూవీ తమిళ్ సూపర్ హిట్ తేరి కి రీమేక్ అని అంటున్నారు. అయితే భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తోనే ఆ మూవీ రీమేక్ చేయనున్నారట. అలానే ఒరిజినల్ వర్షన్ తేరిని ఇక్కడ మన తెలుగు నేటివిటీకి ముఖ్యంగా ఆడియన్స్ తో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేశారట దర్శకుడు హరీష్ శంకర్. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాలు రేపు వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు