వైరల్ పిక్స్ : ‘హరిహర వీరమల్లు’ కోసం పవర్ స్టార్ కరాటే లుక్స్

వైరల్ పిక్స్ : ‘హరిహర వీరమల్లు’ కోసం పవర్ స్టార్ కరాటే లుక్స్

Published on Nov 27, 2022 2:02 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ పీరియాడిక్ డ్రామా మూవీ హరిహర వీరుమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, నర్గీస్ ఫక్రి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా స్వరవాణి కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్ ఆడియన్స్ ని పవన్ ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా మూవీలోని తన వీరమల్లు పాత్ర కోసం ఇప్పటికే ఎంతో కష్టపడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేడు కరాటే శిక్షణ తీసుకుంటున్న పిక్స్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ అయి వైరల్ గా మారాయి. హీరో పవర్ స్టార్ గారి దగ్గరి నుండి ప్రతి ఒక్కరు కూడా హరి హర వీరమల్లు కోసం ఆద్యంతం ఎంతో కష్టపడుతున్నామని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 30న విడుదల కానున్న తమ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు