పవన్ కళ్యాణ్ ‘ఓజి’ లేటెస్ట్ షెడ్యూల్ అప్ డేట్

Published on May 4, 2023 1:07 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఓజి. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.

ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ ని ముంబైలో జరుపుకున్న తమ ఓజి మూవీ యొక్క తాజా షెడ్యూల్ నేటి నుండి పూణే లోని అందమైన పచ్చని లొకేషన్స్ లో నిర్వహిస్తున్నట్లు టీమ్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా తెలిపింది. తొలిసారిగా పవర్ స్టార్ తో సుజీత్ తీస్తున్న మూవీ కావడం అలానే ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో భారీ విజయం సొంతం చేసుకున్న డివివి సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండడంతో ఓజి పై పవన్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :