#Prabhas25: ట్విట్టర్‌లో గట్టిగానే ట్రెండ్ అవుతుందిగా..!

#Prabhas25: ట్విట్టర్‌లో గట్టిగానే ట్రెండ్ అవుతుందిగా..!

Published on Oct 5, 2021 3:00 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని నాగ్ అశ్విన్‌తో చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ 25వ చిత్రం కూడా ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది.

అక్టోబర్ 7వ తేదిన ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించి అప్డేట్ రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో #Prabhas25 ట్యాగ్‌ని ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ఏకంగా టాప్‌ ప్లేస్‌లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉండడమే కాకుండా ప్రభాస్ 25వ చిత్రం అప్డేట్ కోసం బోలెడెంత ఆశతో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరీ ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు