అక్టోబర్ 7న ప్రభాస్ 25 వ చిత్రం అప్డేట్… ఎవరూ ఊహించని రీతిలో…

Published on Oct 4, 2021 1:00 pm IST

బాహుబలి సీరీస్ చిత్రాలతో కేవలం భారత్ లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు ప్రభాస్. వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఇండియా లోనే నంబర్ వన్ పొజిషన్ కి చేరుకున్నారు. రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్ చిత్రాలతో పాటుగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరొక పాన్ వరల్డ్ సినిమా లో నటిస్తున్నారు ప్రభాస్.

రాధే శ్యామ్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కు విడుదల కి సిద్దం అవుతూ ఉండగా, మిగిలిన చిత్రాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి. నాగ్ అశ్విన్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. కాగా తాజాగా ఇప్పుడు ప్రభాస్ 25 వ సినిమా కి సంబందించిన అప్డేట్ త్వరలో విడుదల కానుంది. అక్టోబర్ 7 వ తేదీన ప్రభాస్ 25 వ చిత్రం కి సంబంధించిన ప్రకటన ఉండనుంది.

టాలీవుడ్ లో మొదటి చిత్రం తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి చిత్రం తో టాలీవుడ్ లో ఎవరు చేయలేను సాహసం చేశారు అని చెప్పాలి. ప్రభాస్ 25 వ చిత్రానికి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని పై అక్టోబర్ 7 వ తేదీన ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ను మునుపెన్నడూ లేని విధంగా చూసే అవకాశం వుంది.

సంబంధిత సమాచారం :