సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 25వ సినిమా

Published on Oct 7, 2021 11:04 am IST

గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రభాస్ 25 వ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అభిమానులు ప్రేక్షకులు ఈ చిత్రం అధికారిక ప్రకటన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభాస్ తన 25 వ సినిమా ను అర్జున్ రెడ్డి ఫేం డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా తో చేయబోతున్నారు. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ టైటిల్ ను ప్రకటించడం జరిగింది.

అధికారిక ప్రకటన తో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సందీప్, బాలీవుడ్ లో కూడా ఇదే సినిమాను రీమేక్ చేసి తన సత్తా చాటారు. కబీర్ సింగ్ అంటూ సినిమాను తెరకెక్కించి బాలీవుడ్ లో కూడా విజయం సాధించారు. ప్రభాస్ ను ఈ చిత్రం లో మునుపెన్నడూ లేని విధంగా చూపించనునట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సందీప్ రెడ్డి వంగా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ గా 8 భాషల్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే చిత్రాలతో ప్రభాస్ బిజిగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :