ఇలా నన్ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…స్పిరిట్ పై ప్రభాస్ కీలక వ్యాఖ్యలు!

Published on Oct 7, 2021 1:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన 25 వ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తో చేయబోతున్నారు. నేడు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి స్పిరిట్ అంటూ టైటిల్ ను ప్రకటించడం జరిగింది. టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, మరియు కొరియా భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ నుండి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతున్నారు. ఈ మేరకు సందీప్ రెడ్డి తో చేయనున్న 25 వ చిత్రం గురించి ప్రభాస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నా 25 వ చిత్రం, దీన్ని జరుపుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన కథాంశం అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం పని చేయడానికి వేచి ఉండలేను అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవతారం లో నన్ను ఇలా చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ తెలిపారు ప్రభాస్. ప్రభాస్ 25 వ చిత్రం ప్రకటన వెలువడడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంబంధిత సమాచారం :