తన హిందీ భాష పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రభాస్

Published on Mar 4, 2022 8:40 pm IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ సినిమాలు చేస్తూ ఇండియా లోనే బిజీ ఆర్టిస్టు గా మారిపోయారు. బాహుబలి చిత్రం నుండి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటుగా, విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే తన చిత్రాలకి హిందీ లో తానే డబ్బింగ్ చెబుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సాహో చిత్రం సమయం లో అతని హిందీ భాష పై ట్రోల్ కి గురి అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ మేరకు తనదైన శైలి లో కూల్ గా సమాధానం ఇచ్చారు ప్రభాస్. నా హిందీ కి హైదరాబాదీ టచ్ ఉంది. రాధే శ్యామ్ తో కొంచెం మెరుగ్గా అయ్యాను. ఆది పురుష్ ద్వారా పెర్ఫెక్ట్ అవుతాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :