ఆ షేప్ కోసం ప్రభాస్ చాలా రకాలుగా కష్టపడ్డాడట!

Published on Apr 18, 2022 12:00 am IST

ప్రభాస్ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏ- ఆది పురుష్”. కాగా ‘ఆదిపురుష్‌’ సినిమా కోసం ప్రభాస్ చాలా కసరత్తులను ఫేస్‌ చేశాడట. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డారని.. ముఖ్యంగా విలువిద్యలో ప్రభాస్‌ శిక్షణ కూడా తీసుకున్నారని ఇప్పటికే చిత్రబృందం చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే, ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉండాలి కాబట్టి.. మెయిన్ గా భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉండాలి కాబట్టి, ప్రభాస్ ఈ షేప్ కోసం చాలా రకాలుగా కష్టపడ్డాడు. ప్రభాస్‌ తన ఆకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. మొత్తానికి ప్రభాస్ బాహుబలి సినిమా కంటే.. ఈ సినిమాకే ఎక్కువ కష్టపడ్డాడట. మరి ఈ సినిమా ప్రభాస్ కి ఏ రేంజ్ హిట్ ను ఇస్తుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం :