‘లాల్ సింగ్ చద్దా’ కోసం వెనక్కి తగ్గిన ‘ఆదిపురుష్’..!

Published on Feb 15, 2022 11:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ముందుగా ప్రకటించినట్టు ఆగస్ట్ 11న రిలీజ్ కావడం లేదని తేలిపోయింది. ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కోసం “ఆదిపురుష్”ని దర్శక నిర్మాతలు కాస్తంత వెనక్కి పంపుతున్నారట.

ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉన్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు ఆమీర్ ఖాన్ ప్రకటించాడు. అయితే ఆ రోజు రిలీజ్ కాబోతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వాయిదా వేస్తున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అమీర్‌ఖాన్ తెలిపాడు. దీంతో ప్రభాస్ “ఆదిపురుష్”కి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :