ప్రభాస్ పై ‘కల్కి పార్ట్ 2’ లోనే అంతా..!

ప్రభాస్ పై ‘కల్కి పార్ట్ 2’ లోనే అంతా..!

Published on Jul 5, 2024 12:30 AM IST

చాలా కాలం తర్వాత పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలాంటి హైప్ మూమెంట్ ని ఇచ్చి ముగించాడో కూడా అందరికీ తెలుసు.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ స్టార్టింగ్ నుంచే మరీ అంత ఎగ్జైట్మెంట్ దొరకలేదు అని టాక్ ఉంది. కాకపోతే ప్రస్తుతానికి మొదటి భాగంలో ప్రభాస్ పాత్రని అలా చూపించడమే ప్రధాన పాయింట్ కాగా అసలు ప్రభాస్ పాత్రపై సిసలైన ట్రీట్ అంతా పార్ట్ 2 లోనే దర్శకుడు దట్టించనున్నాడట. లేటెస్ట్ గా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు కూడా వైరల్ గా మారాయి.

ప్రభాస్ తనకి తెలియకుండా కర్ణుడుగా మారాడు కానీ రెండో భాగంలో తానే కర్ణుడు అని తెలుసుకున్నాక ఎలా ఉంటుంది అక్కడ నుంచి ఏం చేస్తాడు అనేది అంతా రెండో పార్ట్ లో ఉంటుంది అని వింటుంటేనే ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి నాగ్ అశ్విన్ ప్రభాస్ రోల్ ని ఎంత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు