వైరల్ : తమపై మొదటి రోజు షూట్ పై ప్రభాస్, అమితాబ్ ల స్పందన.!

Published on Feb 19, 2022 8:00 am IST

మొట్ట మొదటి సారిగా మన తెలుగు నుంచి ఒక భారీ చిత్రం ప్రపంచ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి నటుడు తో కావడం మరింత గ్రాండియర్ గా ఈ సినిమా మారిపోయింది. ప్రస్తుతానికి అయితే “ప్రాజెక్ట్ కే” గా ప్రచారం అవుతున్న ఈ భారీ సినిమాని దర్శకుడు నాగ్ అశ్విన్ స్కై ఫై ఫాంటసి థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

మరి ఆల్రెడీ షూట్ ప్రారంభం అయ్యిన ఈ చిత్రంలో ప్రభాస్ సహా మరికొంత మంది దిగ్గజ నటులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి వారిలో బాలీవుడ్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అయితే నిన్నటితో ఈ ఇద్దరిపై సినిమాలో ఫస్ట్ షాట్ ని తెరకెక్కించడం జరిగిందట. మరి ఈ మొదటి షూట్ తో ఇద్దరు దిగ్గజాలు తమ స్పందనను తెలియజేసుకున్నారు.

మొదటగా ప్రభాస్ “అయితే నా చిరకాల కల నెరవేరింది.. లెజెండరీ అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ షాట్ లో యాక్టు చెయ్యడం జరిగింది” అని ఎగ్జైటింగ్ రెస్పాన్స్ ని తెలియజేయగా అమితాబ్ కూడా ఇదే రీతిలో అద్భుతమైన పోస్ట్ పెట్టడం మరింత వైరల్ గా మారింది. ‘బాహుబలి’ ప్రభాస్ తో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ లో పాల్గొనడం జరిగింది, ప్రభాస్ విధేయత తన ఆరా అతడి టాలెంట్ అపరమైనవి” అని వారి మొదటి స్పందనను తెలియజేసారు. దీనితో ఈ పోస్ట్ లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :