ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ మళ్లీ ఫిక్స్ ?

Published on Mar 28, 2022 7:09 am IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి అని తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ మళ్లీ ఫిక్స్ అయితే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.

మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. ఇక ఈ సినిమా పై డైరెక్టర్ మారుతి రీసెంట్ గా స్పందిస్తూ.. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. దయచేసి అప్పటి వరకూ వేచి ఉండండి. డైరెక్టర్‌ గా నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్’ అని మారుతి చెప్పుకొచ్చాడు. ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో సినిమా చేస్తున్నాడు. ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :