‘ప్రాజెక్ట్ కె’ కోసం దీపికతో చేయి కలిపిన ప్రభాస్..!

Published on Dec 12, 2021 3:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే ఇప్పటికే అమితాబ్, దీపికా పదుకునే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనగా శనివారం ప్రభాస్ సైతం కెమెరా ముందుకు వచ్చేశాడు. ప్రభాస్, దీపికా పదుకునే ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ప్రభాస్, దీపికా పదుకునే వరల్డ్స్ బిగ్గెస్ట్ కెమెరా ముందు ఇలా చేతులు కలిపారని ఈ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ గ్రాండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం ప్రభాస్ డేట్స్ గట్టిగానే ఇచ్చాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :