ప్రభాస్, మారుతిల సినిమా ఓ రేంజ్ లో ఉంటుందట.!

Published on Feb 8, 2022 9:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన లైనప్ లో ప్రభాస్ చేస్తూ వెళ్తున్న ఒక్కో సినిమాకి గాను దాదాపు కొత్త దర్శకులు తోనే ఎవరినీ రిపీట్ చెయ్యకుండా వెళ్తున్నాడు. అలా ఈ లైనప్ లోకి వచ్చిన మరో దర్శకుడే మారుతి. అయితే ఇది ఒక షాకింగ్ ప్రాజెక్ట్ అయినా మేకర్స్ మాత్రం ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

అంతే కాకుండా ఈ సినిమాని మారుతి ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రం ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. అంతే కాకుండా రొమాంటిక్ యాంగిల్ కూడా ఈ చిత్రంలో సాలిడ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హారర్ బ్యాక్ డ్రాప్ లో కూడా కనిపిస్తుంది అని టాక్ ఉంది. మరి వాటితో పాటుగా ఈ ఎలిమెంట్స్ కలిపి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్నట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :