ఒకే చోట ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్..!

Published on Jul 28, 2021 2:00 am IST

పాన్ ఇండియన్ హీరోగా మారిపోతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ‘స‌లార్’ షూటింగ్ సగానికిపైగా పూర్త‌యింది. ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కూడా ముంబైలో జ‌రుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాను మొద‌లు పెట్టాడు.

అయితే దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. సైంటిఫిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ షూట్‌ను రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలెట్టనున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త అంశమేమిటంటే ఈ సినిమా షూటింగ్‌ 90% రామోజీ ఫిలిం సిటీలోనే కంప్లీట్ చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. రామోజీ ఫిలిం సిటీలో తన కథకు పూర్తి స్థాయి వసతులు ఉన్నాయని, కేవలం 10 శాతం షూటింగ్ మాత్రమే బయట ప్రదేశాల్లో చేసేందుకు ఆయన ఫిక్స్ అయ్యాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :