లేటెస్ట్ : ‘సీతారామం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్

Published on Aug 2, 2022 8:15 pm IST

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథగా 1965 సమయంలో జరిగిన హృద్యమైన యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీగా సాగనున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా రష్మిక మందన్న ఒక ముఖ్య పాత్ర చేస్తోంది.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించగా ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సూపర్ గా ఆకట్టుకుని మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 7 గంటల నుండి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించనుండగా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారు. కొద్దిసేపటి క్రితం సీతారామం యూనిట్ ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఆగష్టు 5 న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :