బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ప్రభాస్ !


‘బాహుబలి’ సిరీస్ తో రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయా స్థాయి నటుడిగా మారిపోయారు. సినిమా కోసం ఆయన చూపిన డెడికేషన్ చూసి ఆయనతో సినిమాలు చేయాలని దేశంలోని టాప్ దర్శకులు, నిర్మాతలు ఉవ్విళూరుతుంటే పలు వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని ఆయన్ను గత కొన్నేళ్లుగా కోరుతున్నాయి.

కానీ ‘బాహుబలి’ సినిమా కోసం ఇన్ని సంవత్సరాల పాటు ఎన్ని ఆఫర్లొచ్చినా తిరస్కరించిన ప్రభాస్ తాజాగా మొబైల్ సంస్థ జియోనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ మేరకు అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయట. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ సింగ్ డైరెక్షన్లో ‘సాహో’అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.