ఆకాష్ పూరీకి డార్లింగ్ ప్రభాస్ బెస్ట్ విషెస్

Published on Jun 24, 2022 1:00 am IST

ప్రస్తుతం యువ హీరో ఆకాష్ పూరి నటిస్తున్న కమర్షియల్ మూవీ చోర్ బజార్. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాష్ సరసన గెహన సిప్పి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుండి ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా నేడు రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచింది. ఈ సినిమాలో బచ్చన్ పాత్రలో ఆకాష్ కనిపించనుండగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా మూవీ తెరకెక్కిందని, తప్పకుండా హీరోగా ఆకాష్ కి చోర్ బజార్ మూవీ మంచి బ్రేక్ ని అందిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇక రేపు గ్రాండ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీకి ముందస్తుగా తన తరపున అభినందనలు తెలియచేసారు డార్లింగ్ ప్రభాస్. ఆకాష్ తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గతంలో పలు సక్సెస్ఫుల్ మూవీస్ చేసిన ప్రభాస్ కు ఆయనతో మంచి అనుబంధం ఉంది. తప్పకుండా తన బ్రదర్ ఆకాష్ నటిస్తున్న చోర్ బజార్ మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటూ కొద్దిసేపటి క్రితం ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీ లో యూనిట్ కి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియచేయడంతో పాటు మూవీ ట్రైలర్ లింక్ ని షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :