“లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్” టీమ్ కి రెబల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ విషెస్!

“లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్” టీమ్ కి రెబల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ విషెస్!

Published on Nov 3, 2022 2:34 PM IST

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్. ఈ చిత్రం నవంబర్ 4, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం రిలీజ్ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భం గా ప్రభాస్ చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఆముక్త క్రియేషన్స్ మరియు నీహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లపై తెరకెక్కిన ఈ చిత్రం మంచి బజ్ ను సొంతం చేసుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు