“ఆదిపురుష్” తో మొదలైన ప్రభాస్ బర్త్ డే ట్రీట్.!

“ఆదిపురుష్” తో మొదలైన ప్రభాస్ బర్త్ డే ట్రీట్.!

Published on Oct 23, 2022 9:05 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ గా ప్లాన్ చెయ్యగా దీని నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ లు వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకున్నాయి. ఇక ఈరోజు అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కావడంతో అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్స్ లో ఆదిపురుష్ నుంచి కూడా ఒకటి.

మరి మేకర్స్ అయితే ఈ ఉదయాన్నే కొన్ని సాలిడ్ పోస్టర్స్ ని అయితే రిలీజ్ చేసారు. మరి రామావతారంలో ప్రభాస్ మరింత తీక్షణంగా కనిపిస్తుండగా ఈ కొత్త పోస్టర్స్ తో అయితే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనితో పాటుగా ఇతర సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ సినిమాలో అయితే కృతి సనన్ నటించగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు