దీపికా పదుకునే కి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రభాస్

Published on Jan 5, 2022 2:55 pm IST

ప్రభాస్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటన్నిటి కి నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ తారాగణం ఈ చిత్రం లో భాగస్వామ్యం అవ్వడం మాత్రమే కాకుండా, భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం.

ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలివుడ్ భామ దీపికా పదుకునే నటిస్తుంది. దీపికా పదుకునే ఈ ప్రాజెక్ట్ లో చేరినప్పటి నుండి సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. నేడు దీపిక పదుకునే పుట్టిన రోజు సందర్భంగా హీరో ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ వేదిక గా, అందమైన నవ్వు ఉన్న దీపికా పదుకునే కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. తన ఎనర్జీ తో, టాలెంట్ తో ప్రాజెక్ట్ కే సెట్స్ ను మరింత ప్రకాశ వంతం గా చేస్తుంది అని అన్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :