“రాధే శ్యామ్” ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ప్రభాస్!

Published on Mar 6, 2022 11:00 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సరికొత్త చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం లో పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిత్ర యూనిట్ సైతం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వూ లు, కార్యక్రమాల తో బిజీగా ఉన్నారు. సాహో చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :