వినూత్న జానర్స్ లో టోటల్ 8 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ బిజీ బిజీ.!

Published on Jan 22, 2022 4:00 pm IST

ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా ఓకే చేస్తే అది కేవలం తన ఒక్కడి వల్లే పాన్ ఇండియన్ సినిమాగా మారిపోతున్న పరిస్థితి. తన దగ్గరకి ఒక ఆసక్తికర కథ వస్తే చాలు దర్శకుణ్ణి ఆ కథని నమ్మి ఓకే చేసేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్. మరి ఆల్రెడీ ప్రభాస్ సాలిడ్ లైనప్ లో రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకోగా మరో మూడు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.

ఇక ఈ ఐదు కాకుండా మరో మూడు సినిమాలకి ఈ పాన్ ఇండియన్ స్టార్ ఓకే చెప్పి టోటల్ 8 భారీ సినిమాలతో బిజీ కానున్నాడట. మరి ఈ లైనప్ లో ఒక్కో సినిమా కోసం చూద్దాం.. మొదటగా దర్శకుడు రాధా కృష్ణతో చేసిన సినిమా “రాధే శ్యామ్” ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యి రిలీజ్ కి కూడా ఇప్పుడు రెడీగా ఉంది.

ఇక దీని తర్వాత బైలాంగువల్ సినిమా దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేసిన ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక వీటి తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో “సలార్” అనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్, అలాగే దర్శకుడు నాగశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో పాన్ వరల్డ్ సినిమా “ప్రాజెక్ట్ కే” దీని తర్వాత దర్శకుడు సందీప్ వంగ తో పాన్ ఆసియన్ సినిమా పోలీస్ డ్రామా చిత్రాలు చేస్తున్నాడు.

ఇక్కడ వరకు ఇంట్రెస్టింగ్ జానర్స్ ఇతిహాసం నుంచి సైన్స్ వరకు అన్ని కాలాలు ప్రభాస్ చుట్టేశాడు. మరి వీటి తర్వాత మరో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఒక సినిమా ఉంది దానిని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లోనే అన్నట్టు టాక్. ఇంకా మరో టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడని సినీ వర్గాల్లో టాక్..

ఇక ఫైనల్ గా ఎనిమిదవ ప్రాజెక్ట్ లేటెస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ దర్శకుడు మారుతితో అందులోని “RRR” నిర్మాత డీవీవీ దానయ్య తో హారర్ కం కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేసినట్టు టాక్ హోరెత్తుతోంది. ఇలా టోటల్ గా బ్యాక్ టు బ్యాక్ 8 సినిమాలు విభిన్న తరహా సినిమాలతో ప్రభాస్ లైనప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత సమాచారం :