ప్రభాస్ మిస్సయినా కాల్ చేసి చెప్పాడట.!

Published on Sep 9, 2021 8:00 am IST


ఈ రానున్న వినాయక చవితి మహోత్సవానికి టాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర చిత్రాలే రేస్ లో ఉన్నాయి మరి వాటిలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా అలరించేందుకు వస్తున్న అవైటెడ్ చిత్రం “సీటీమార్”. మ్యాచో మ్యాన్ గోపీచంద్ హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ స్పోర్ట్స్ డ్రామా ఈ 10న రిలీజ్ కి రెడీ అయ్యింది..

అయితే ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న మేకర్స్ నిర్వహించారు. మరి ఈ ఈవెంట్ కి గోపీచంద్ డియరెస్ట్ ఫ్రెండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడని ఊహాగానాలు వినిపించాయి. వీరి బాండింగ్ మూలాన ప్రభాస్ ఖచ్చితంగా వస్తాడని చాలా మంది ఆశించారు. కానీ అది జరగలేదు.. అయినా తాను అటెండ్ కాకపోయినప్పటికీ గోపీచంద్ తన స్పీచ్ లో అసలు విషయం చెప్పాడు..

నా ఫ్రెండ్ రాలేకపోయినా కాల్ చేసి ట్రైలర్ చూసి చాలా బాగుంది రా అన్నాడు ఆ ఫ్రెండ్ ఎవరో అర్ధం అయ్యి ఉంటుంది అని గోపీచంద్ అసలు విషయం చెప్పాడు. మరి ఈ చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు ఈ చిత్రానికి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :