“సలార్” సెట్స్ లో నీల్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన డార్లింగ్.!

Published on Jun 4, 2023 8:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్” ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా రిలీజ్ తో పాటుగా మరో పక్క తన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” లో కూడా ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి రెండు భాగాలు ఒకేసారి చేస్తున్నారో ఏమో కానీ షూటింగ్ అలా కంటిన్యూ అవుతూ వస్తున్నా ఈ సినిమా దర్శకుడు బర్త్ డే అయితే ఇప్పుడు వచ్చింది.

మరి లేటెస్ట్ గా సినిమా సెట్స్ నుంచి అయితే డార్లింగ్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలను చేయడం వైరల్ గా మారింది. నీల్ చేత కేక్ కోయించి సెట్స్ లో తన పుట్టినరోజు వేడుకలు చేశారు. మరి ఈ బర్త్ డే ట్రీట్ లో అయితే ప్రభాస్ సహా చిత్ర యూనిట్ అంతా కూడా పాల్గొన్నారు. దీనితో ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రం అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 28 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :