‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి ప్రభాస్ ప్రత్యేక అభినందనలు

‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి ప్రభాస్ ప్రత్యేక అభినందనలు

Published on Dec 13, 2022 12:24 AM IST


భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ గ్రాండియర్ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల తరువాత రూ.1150 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టింది. అలానే ఈ మూవీకి గ్లోబల్ గా హాలీవుడ్ సహా అనేక దేశాలు, భాషల ఆడియన్స్ యొక్క మెప్పు లభించడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి బెస్ట్ పిక్చర్ అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నామినేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి నుండి మంచి ప్రసంశలు లభిస్తున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఇంతటి ఘనత సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ కి అలానే దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, చరణ్, సంగీత దర్శకడు ఎమ్ ఎమ్ కీరవాణి వంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. కాగా ఆర్ఆర్ఆర్ పై ప్రసంశలు కురిపిస్తూ ప్రభాస్ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CmEzLW6Py_b/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు