3 పాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్ క్రేజీ లైనప్.!

Published on Mar 23, 2023 7:05 am IST


మన టాలీవుడ్ లో ప్రస్తుత తరం స్టార్ హీరోస్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మొట్ట మొదటిగా పాగా వేసిన హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి తర్వాత నుంచి పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ఫాలోయింగ్ అండ్ మార్కెట్ ని తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్ పై అయితే కన్నేశాడు.

అవ్వడానికి మొదటగా పాన్ వరల్డ్ సినిమాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తో భారీ సినిమా “ప్రాజెక్ట్ కే” ని మొదటగా అనౌన్స్ చేయగా ఇప్పుడు దానితో పాటుగా మరో రెండు సినిమాలు కూడా వరల్డ్ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలే “ఆదిపురుష్” మరియు “సలార్” చిత్రాలు. మొదట ఈ సినిమాలు రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే అనౌన్స్ కాగా ఇప్పుడు అయితే హాలీవుడ్ రిలీజ్ కి కూడా సిద్ధం అవుతున్నాయి.

మొదటగా దర్శకుడు ఓంరౌత్ అయితే ఆదిపురుష్ ని ఇంగ్లీష్ రిలీజ్ ని కూడా కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు సలార్ కూడా ఇంగ్లీష్ రిలీజ్ ఉంటుంది అని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీనితో వరుసగా మూడు సినిమాలు ప్రభాస్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండనున్నాయని చెప్పాలి. ఇక వీటి తర్వాత ప్రభాస్ ఫేమ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :