క్లాస్ సినిమాతో ఇండియన్ రికార్డ్ సెట్ చేసిన ప్రభాస్.!

Published on Dec 25, 2021 8:00 am IST

ఇప్పుడు ప్రభాస్ అనే పేరు పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఒక బ్రాండ్.. తన వల్ల సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియన్ ఫేమ్ ని తెచుకుంటున్నాయి. మరి ఇప్పుడు అలానే పాన్ ఇండియన్ వైడ్ భారీ అంచనాలుతో రిలీజ్ కి రెడీగా ఉన్న లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్”.

దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ భారీ సినిమా కంప్లీట్ గా క్లాస్ ఎలిమెంట్స్ తో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి సినిమాతో కూడా ఇండియన్ రికార్డు సెట్ చెయ్యడం అనేది ప్రభాస్ కే చెల్లింది అని చెప్పాలి. తన భారీ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఏకంగా 64 మిలియన్ రియల్ టైం వ్యూస్ అన్ని భాషల్లో అందుకొని ఆల్ టైం ఇండియన్ రికార్డుని సెట్ చేసింది.

దీనితో ఇలాంటి ఒక క్లాస్ సినిమాతో కూడా ఆల్ టైం రికార్డు సెట్ చెయ్యడం అనేది ప్రభాస్ కే చెల్లింది అని చెప్పాలి. మరి దీనికే ఇలా ఉంటే రాబోయే “సలార్”, “ఆదిపురుష్” లెక్కలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయో చెప్పక్కర్లేదు.

సంబంధిత సమాచారం :